Close

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా అండగా ఉంటాం… జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 18/11/2024

ఏలూరు, నవంబర్, 18: కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నూజివీడుకు చెందిన కె. సంజనాప్రియకు వీల్ చైర్ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంజనాప్రియను పలకరిస్తూ బాగా చదువుకోవాలని సూచించారు. దివ్వాంగులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ వారికి సహాయంగా ఉంటామన్నారు. దివ్యాంగులు వీల్ చైర్స్ లేక నడవలేని స్ధితిలో ఉన్నవారికి చాలా సహాయంగా ఉపయోగపడే వీల్ చైర్స్ నందించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ సందర్బంగా దివ్యాంగురాలైన సంజనాప్రియ అర్జీని పరిశీలిస్తూ ఆమెకు ప్రస్తుతం అందుతున్న ఆరువేల పెన్షన్ ను 15 వేలకు పెంచే విషయంపై అవసరమైన చర్యలు తసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, డిఇఓ వెంకట లక్ష్మమ్మ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.