రైతుకు నచ్చిన మిల్లుకే ధాన్యం రవాణా.. పౌర సరఫరాల సంస్ధ యండి డా. మనజీర్ జీలానీ సామూన్..
ఏలూరు/భీమడోలు, నవంబరు, 22: ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను పౌర సరఫరాల సంస్ధ వైస్ చైర్మన్, మేనిజింగ్ డైరెక్టరు యండి డా. మనజీర్ జీలానీ సామూన్ ఆదేశించారు. శుక్రవారం భీమడోలు మండలం పోలసాని పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అంబర్‌పేటలోని శ్రీ దుర్గా ఆగ్రో ఇండస్ట్రీస్ ను, పాతురులోని ఎంఎల్ఎస్ పాయింటును జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డితో కలిసి పరిశీలించారు. తొలుత జిల్లాకు విచ్చేసిన పౌర సరఫరాల సంస్ధ యండి డా. మనజీర్ జీలానీ సామూన్ కు జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు సమీపంలో తమకు ఇష్టమైన మిల్లులకే ధాన్యాన్ని తరలించుకొనే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లాలో ఖరీఫ్ దాన్యం కొనుగోలుకు 250 రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశారన్నారు. ఇంతవరకు రూ. 136.44 కోట్ల విలువైన 68164 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారన్నారు. పాతురు ఎంఎల్ఎస్ పాయింటును తనిఖీ చేసిన ఆయన ప్రజా పంపిణి వ్యవస్థలో భాగంగా చౌక ధరల దుకాణముల ద్వారా ఇచ్చు నిత్యావసర సరుకులను సరైన పద్దతిలో సరైన తూకం తో పంపిణి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రముల నుండి రైతులకు పంపిణిచేయబడుచున్న గోనె సంచులను పరిశీలించారు. సదరు గోనె సంచులలో కొన్ని సరిగా లేవని గుర్తించిన ఆయన వాటిని త్రిప్పి పంపించవలసినదిగా దాన్యం కొనుగోలు కేంద్రములోని సిబ్బందిని అదేశించారు. రైతులు వారు పండించిన ధాన్యము నిర్దారిత నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నచో రైస్ మిల్లర్లు నిర్దారిత అంచనా సమయం లోపు దాన్యమును దిగుమతి చేసుకోనుటకు అవసరమైన తగు హమాలిలను మరియు ఇతర అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. సకాలములో ధాన్యము సేకరణ పోర్టల్‌లో ట్రక్ చిట్ ద్వారా ధాన్యము రైస్ మిల్లుకు చేరినట్లుగాను మరియు అట్టి ధాన్యము దించుకున్నట్లుగా దృవీకరించవలసిదిగా ఆదేశించారు. రైస్ మిల్లర్లు ధాన్యము కొనుగోలు విషయములో అలక్షము వహించినచో ఖఠిన చర్యలు తీసుకొనబడునని హెచ్చరించారు.
వీరి వెంట పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు ఎన్. శ్రీలక్ష్మీ, పలువురు రెవిన్యూ అధికారులు ఉన్నారు.