Close

యాంటీబయోటిక్ లు వినియోగం ఆపండి-రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 22/11/2024

ఏలూరు, నవంబరు, 22: రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా భవిష్యత్ ను కాపాడుకోవచ్చని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో వరల్డ్ ఎఎంఆర్ అవేర్ నెస్ వీక్ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రతి మనిషి రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. అవసరం లేని మందులు వాడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అవసరానికి మించి యాంటీబయోటిక్ లు వినియోగం చేయకూడదన్నారు. డాక్టరుని సంప్రతించకుండా స్వయంగా మందులు వినియోగించవద్దని హితవు పలికారు.
కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.ఎస్. రాజు, డిఎంహెచ్ఓ డా.ఎస్. శర్మిష్ట, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్ కుమార్, ఆర్.ఎం.ఓ. డి. దుర్గాకుమార్, మైక్రోబయాలజీ హెచ్ఓడి శశిధర్, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సావిత్రి, వైద్య కళాశాల విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.