వివిధ ఎన్ హెచ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల భూసేకరణ తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు,నవంబర్,23: జిల్లాలో ల్యాండ్ బ్యాంక్, అసైన్డ్ ల్యాండ్ కు సంబంధించి సమగ్ర వివరాలు సమర్పించాలని తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. శనివారం సాయంత్రం స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అర్డివోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు తదితరులతో వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్ట్ లు, చింతలపూడి లిఫ్టు ఇరిగేషన్, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ భూసేకరణ పనులను సంబంధిత ఆర్డీఓలు ఎప్పటికప్పుడు సంబంధిత తహశీల్దార్లతో సమీక్షించి వేగవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, తదితర ప్రాధాన్యత అంశాలకు సంబందించిన భూసేకరణ పనులు వేగవంతం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ కు సంబంధించి కోర్టులలో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. కైకలూరు డంపింగ్ యార్డు, నూజివీడు, జంగారెడ్డిగూడెం ఎస్ టిపిలకు సంబందించి భూసేకరణపై కలెక్టర్ సమీక్షించారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డివోలు, తహశీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.