Close

ఎన్నికల సక్రమ నిర్వహణకు శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు చెప్పారు.

Publish Date : 26/11/2024

ఏలూరు, నవంబర్, 26: ఎన్నికల సక్రమ నిర్వహణకు శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా డిఆర్ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగుతాయన్నారు. ఈ విధానం పై ఎన్నికల అధికారులకు, సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. శిక్షణ సమయంలో పొందిన అంశాలతో సిబ్బంది ఎటువంటి పొరపాటు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. సిబ్బందికి ఏమైనా సందేహాలుంటే వెంటనే శిక్షకుల దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని నివృత్తి చేయడం జరుగుతుందన్నారు.
మాస్టర్ ట్రైనర్ శ్రీనివాసరావు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పోలింగ్ సామాగ్రి వినియోగం, పోలింగ్, అనంతరం బ్యాలెట్ బాక్సలకు సీల్ వేసి, స్ట్రాంగ్ రూంలకు అప్పగించే వరకు ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, సిబ్బంది చేయవలసి పనులపై శిక్షణ అందించారు.
సమావేశంలో ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, వివిధ మండలాల తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.