పిజిఆర్ఎస్ లో రెవిన్యూకి సంబందించిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి..
ఏలూరు, నవంబరు, 26: ప్రజల నుంచి వస్తున్న అర్జీలను తక్షణమే నాణ్యతతో పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి పిజిఆర్ఎస్(రెవిన్యూ), ఫ్రీహోల్డ్ ల్యాండ్స్ వెరిఫికేషన్, వాటర్ టాక్స్ మ్యాడ్యూల్స్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో భూ పరిపాలన ప్రధాన కమీషనరు జి. జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లాలో రెవిన్యూ అంశాలకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం, ఇళ్ల స్ధలాలు, మ్యూటేషన్స్ తదితర అర్జీల పరిష్కార తీరును కలెక్టర్ వివరించారు. అర్జీలు అందిన వెంటనే వాటిని పరిశీలించి అర్జీదారుని సంతృప్తి చెందేలా పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ కు సంబంధించి 87 శాతం పరిశీలన పూర్తయిందన్నారు.
ఈ సందర్బంగా సిసిఎల్ఏ కమిషనర్ జయలక్ష్మి మాట్లాడుతూ నిషేదిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను పునః పరిశీలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రీ సర్వే వేగంగా పూర్తి చేయాలన్నారు. నీటి తీరువా పన్నులు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు