ఇంటర్ క్వార్టర్లీ మార్కుల ఆధారంగా ఉత్తీర్ణశాతం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, నవంబరు,25: ఇంటర్ క్వార్టర్లీ మార్కుల ఆధారంగా ఉత్తీర్ణశాతం మెరుగుపడేలా కళాశాలల ప్రిన్సిపల్స్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రి సెల్వి సూచించారు.
సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని 19 జూనియర్ కళాశాలల 30 హై స్కూల్స్ కు సంబంధించి విద్యాశాఖాధికారులు,ఆర్డీవోలు మండల విద్యాశాఖ అధికారులతో అపార్ నమోదు ప్రక్రియ,ఇంటర్ మరియు ఏ 1, ఏ 2 క్వార్టర్లీ పరీక్షల ఫలితాలు,స్టూడెంట్ అడ్మిట్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, అపార్ నమోదు ప్రక్రియను మండలాల వారీగా సమీక్షించారు. మండలాల్లో అపార్ నమోదు ప్రక్రియ ఆరా తీశారు. జిల్లాలో ఆధార్ నమోదు కేంద్రాలు 45 ఉన్నాయని, ఇంకా ఎక్కడైనా అవసరమైతే అపార్ కోసం ఆధార్ కేంద్రాలు ప్రారంభించాలన్నారు. టార్గెట్ ప్రకారం అపార్ నమోదును త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని మండలాల్లో పుట్టిన తేది, పేరు తదితర వివరాలు తప్పుగా నమోదుకావడం వల్ల వాటిని సరిచేసి ఆధార్ ను అనుసంధానం చేయాలని ఆదేశించారు.పుట్టిన తేదీలో తప్పులు దొర్లితే ఆర్డీవో లు వాటిని సరిచేసే చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంటర్ మరియు ఏ 1, ఏ 2 క్వార్టర్లీ పరీక్షల ఫలితాలు పై సమీక్షిస్తూ వాటి ఫలితాలను బట్టి పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువ ఉత్తీర్ణ శాతం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో ఆర్డీవోలు యం. అచ్యుత అంబారిష్ , ఎంవి రమణ,ఇన్చార్జి సీఈవో విజయ రాజు,డివిఇవో బి. ప్రభాకరరావు, ఆర్ఐ కె. చంద్రశేఖరబాబు,విద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ షరీఫ్, యంఇవోలు తదితరులు పాల్గొన్నారు.