Close

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి.

Publish Date : 25/11/2024

ఏలూరు,నవంబరు,25: దోషరహిత ఓటరు జాబితాను రూపొందించడంపై సంబంధిత అధికారులు ధ్యాసపెట్టాలని పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎం.ఎం. నాయక్ చెప్పారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వితో కలిసి 2005 ఓటర్ల జాబితా స్వచ్చీకరణపై ఈఆర్ఓలు, ఎఇఆర్ఓలతో ఆయన సమీక్షించారు. తొలుత ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎం.ఎం. నాయక్ కు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి లు పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు ఓటర్లజాబితా ఎంతో కీలకమైనదని అటువంటి జాబితా రూపకల్పనలో ఎటువంటి తప్పులకు తావులేకుండా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు పకడ్బందీగా ఓటర్ల జాబితా స్కూట్ని చేయాలన్నారు. . రానున్న నెల రోజుల సమయంలో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బిఎల్ఓ లతో ఇఆర్ఓలు సమావేశం నిర్వహించాలని చెప్పారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబిత రూపకల్పనకు బిఎల్ఓల సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో 18-20 సంవత్సరాల వయస్సు కలిగిన యువతను ముఖ్యంగా డిగ్రీ కళాశాల విద్యార్ధులను నూతన ఓటర్లుగా చేర్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో లాజికల్, డెమోగ్రాఫికల్ పొరపాట్లు ఉంటే వాటిని పూర్తిస్ధాయిలో సవరించాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా కార్యక్రమంలో ఓటర్ల తొలగింపు సమయంలో ఒకటికి రెండుసార్లు క్షుణంగా పరిశీలించాలన్నారు. ఇపిరేషియో, జండర్ రేషియో అంశాల్లో ఉన్న వ్యత్యాసాలను పరిశీలించుకోవాలన్నారు. ఓటరుగా నమోదు, సవరణకు అర్హులైన వారు ఎవరైనా సరే 6,7,8, ధరఖాస్తు ఫారాలను భర్తీచేసి అందజేయాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో రాజకీయపక్షాల ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడూతు జిల్లాలో 2025 ఓటర్ల జాబితా సవరణ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలను వివరించారు. జిల్లాలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజవర్గాలు, 28 మండలాలు ఉన్నాయని వాటిలో ద్వారకాతిరుమల మండలం గోపాలపురం నియోజకవర్గంలో ఉందని తెలిపారు. 7 మంది ఇఆర్ఓలు ఉన్నారన్నారు. సంబంధించి అక్టోబరు 29 నాటికి 16,38,436 మంది ఓటర్లుగా నమోదైవుందన్నారు. వారిలో 7,99,781 మంది పురుషులు, 8,38,531 మంది మహిళలు, 124 మంది ఇతరులు ఉన్నారన్నారు. సర్వీసు ఓటర్లు 683 మంది ఉన్నారన్నారు. జిల్లాలో 1744 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వాటన్నింటిని పరిశీలించడం జరిగిందన్నారు. జండర్ రేషియో పరిశీలిస్తే ప్రతి వెయ్యి పురుషుల ఓటర్లకు 1048 మంది మహిళలు ఉనారన్నారు. ఇపిరేషియో పరిశీలిస్తే 757 గా ఉందన్నారు. జిల్లాలో 2025 ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఈనెల 9,10 మరియు 23,24 తేదీల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. డిశంబరు 24 నాటికి క్లైయిమ్ లు అభ్యంతరాలను పరిష్కరించడం పూర్తిచేస్తామన్నారు. తది జాబితాను 2025 జనవరి 6వ తేదీన ప్రకటించడం జరుగుతుందన్నారు. జిల్లాలో తీసుకున్న ప్రత్యేక కార్యక్రమాలు ద్వార 18-19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 43833 మందిని ఓటర్లుగా నమోదు చేశామన్నారు.
సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, విఆర్ఓలు, ఏలూరు ఆర్డిఓ ఎం. అచ్యుత అంబరీష్, జంగారెడ్డిగూడెం అర్డిఓ ఎం.వి. రమణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యం. ముక్కంటి, ఎపిఐఐసిజెడ్ఎం కె. బాబ్జి, మరియు డిఆర్డిఎ పిడి ఆర్. విజయరాజు, పలువురు ఎఇఆర్ఓలు, తదితరులు పాల్గొన్నారు.