మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో పర్యటించిన జాయింట్ కలెక్టర్ ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించిన జేసి
ఏలూరు/మండవల్లి,నవంబర్ 27: మండవల్లి,ముదినేపల్లి మండలాల్లో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ పి. దాత్రి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్య సేకరణ తీరు తెన్నులను తనిఖీ చేశారు. వాతావరణశాఖ జారీచేయబడిన
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందనవసరంలేదని జిల్లాలో అప్పటికి సూర్చబడినలో
ధాన్యం కొనుగోలు, రవాణా చేయుటకు ఇప్పటికే తగినన్ని గోనెసంచులు ,రవాణా వాహనములతో సహా
అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసి ప్రభుత్వ యంత్రాంగం తుఫాన్ ఎదుర్కొనడానికి సర్వ
సన్నద్ధముగా ఉందన్నారు.రాగల తుపాను ప్రభావము జిల్లాలో కేవలం పోలవరం, ముదినేపల్లి, కైకలూరు, కలిదిండి మండలాలపై మాత్రమే పాక్షిక ప్రభావం చూపగలదని, కావున రైతులు నిశ్చింతగా ఉండవచ్చునని
భరోసానిచ్చారు. తుఫాను భయంతో గాబరాపడి ఎవరూ ముందస్తు కోతలు, నూర్పిడికి పాల్పడవద్దుననీ,
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు, కావున దళారుల మోసపూరిత
మాటలను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా రైతులను మబ్యపెట్టి మధ్యవర్తులు అక్రమంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు
తీసుకొనబడతాయని హెచ్చరించారు.