Close

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం 1098 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 27/11/2024

ఏలూరు, నవంబర్, 27 : బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని, ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగితే వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. బాల్య వివాహాలకు నియంత్రణకు సంబంధించిన దేశవ్యాప్త కంప్లైంట్ పోర్టల్ ను బుధవారం ఆన్లైన్ ద్వారా కేంద్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి అన్నపూర్ణాదేవి ఆన్లైన్ ద్వారా పోర్టల్ ను ప్రారంభించి అన్ని రాష్ట్రాల నుంచి కూడా బాల్యవివాహాలకు గురికాకుండా రక్షింపబడిన బాలికల తో కేంద్ర మంత్రి ఇంటరాక్ట్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా గత సంవత్సరంలో బాల్య వివాహం నిలుపుదల చేసి చదువు కొనసాగిస్తున్న ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాక గ్రామంనకు చెందిన మజ్జి రమ్య అను బాలిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మాట్లాడి తనని తాను బాల్య వివాహం నుంచి ఎలా రక్షింపబడింది తను భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటుంది వివరించడం జరిగింది. అనంతరం తనని కలిసిన కుమారి మజ్జి రమ్యను జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి కుటుంబా ఆర్థిక పరిస్థితులు రీత్యాగాని వేరువేరు కారణాలతో బాల్యవివాహాల సమస్యను ఎదుర్కుంటున్న బాలికలు ఎవరైనా కూడా ధైర్యంగా ముందుకు వచ్చి తమను తాము రక్షించుకోవటానికి 1098 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇస్తే వెంటనే రక్షించడం జరుగుతుందన్నారు. బాలికలకు వివాహానికి చట్టపరమైన అర్హత వయస్సు వచ్చేంతవరకు తమ పిల్లలకు వివాహం చేయవద్దని తల్లిదండ్రులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మావతి పెదపాడు ఐసిడిఎస్ సిడిపిఓ విజయలక్ష్మి డిసిపిఓ సూర్యచక్ర వేణి తదితరులు పాల్గొన్నారు.