Close

ప్రతీ అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 02/12/2024

ఏలూరు,డిసెంబర్,2: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
(పిజిఆర్ఎస్)కు సంబంధించి అర్జీల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి , ప్రతీ అర్జీకి అర్థవంతమైన సమాదానం ఇస్తూ పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.

సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక(పిజిఆర్ఎస్)లో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు,డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఆర్డిఓ అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యం.ముక్కంటి,
కె.భాస్కర్,మున్సిపల్ కమీషనరు ఎ. భానుప్రతాప్ లతో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన పిజిఆర్ఎస్ లో 248 అర్జీలు వచ్చనట్లు తెలిపారు.
ప్రతీ అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్ర స్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీ-ఓపెన్ అయినట్లైతే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు.
జిల్లా అధికారులు పిజిఆర్ఎస్ లో జిల్లాలోని అర్జీల పరిష్కారానికి సంబంధించి సొంత లాగిన్ ను ఓపెన్ చేసి ప్రతి అర్జీని పరిశీలించి అర్జీల పరిష్కారనికి కృషి చేయాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత కనబరచాలని, అర్జీలు రీఓపెన్ లేకుండా అధికారులు శ్రద్దవహించాలని సూచించారు.

అందిన అర్జీలలో కొన్ని…

ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన లక్కబత్తుల వెంకటేశ్వరరావు దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
ఏలూరు రాజేశ్వరి నగర్ చెందిన గుత్తికొండ వెంకటరామారావు అర్జీనిస్తూ డ్రయిన్ వాటర్, వర్షపు నీరు సరైన పారుదల లేక తమ కాలనీ లో దోమలు చేరుతున్నాయని ఈ సమస్య పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవాలని కోరారు.
మండవల్లి మండలం కానుకల్లు గ్రామానికి చెందిన పీ. మీనా కుమారి అర్జీనిస్తూ గ్రామంలో మంచినీటి భావి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన సంకు నాగ రామాంజనేయులు తమ వ్యవసాయ భూమి పక్కన చేపల చెరువు తవ్వడం వల్ల తమ చేనుకు తీవ్ర నష్టం కలుగుతుందని ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.