ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈనెల 11, 12 వతేదీలలో రెండు రోజులపాటు జరగనున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

ఏలూరు, డిసెంబర్, 11 : ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈనెల 11, 12 వతేదీలలో రెండు రోజులపాటు జరగనున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి. మొదటి రోజు వ్యవసాయం, అనుబంధ రంగాలు, జి.డి.పి .,. తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
అమరావతి: కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్
– కలెక్టర్ల కాన్ఫరెన్స్ రోజే గూగుల్ తో MOU చేసుకున్నాం
– టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలి
– మొదటి కాన్ఫరెన్స్ లో చీకటిలో ఉన్నాం..ఇప్పుడు కొద్దిగా వెలుతురులోకి వచ్చాం
– కలెక్టర్లకి జీతాలు మొదటి తేదీన అందుకోలేదు.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం
– మీరు సమర్థత పెంచుకోవాలి.. తప్పులు చేసిన వారిని శిక్షించాలి..
– విశ్వసనీయత ఉండడం వల్ల వెళ్లిపోయిన కంపెనీలు వెనక్కి వస్తున్నాయి
– స్పీడ్ ఆఫ్ బిజినెస్ తో ముందుకు వెళ్తున్నాం
– కలెక్టర్స్ పోటీ పడాలి..సమీక్ష కోసం మీటింగ్ పెట్టుకున్నాం..
– 4 సార్లు ముఖ్యమంత్రి.. మొదటిసారి.. ఎప్పుడు చూడని ఇబ్బంది చూస్తున్నాను..
– 10లక్షల కోట్లు అప్పు
– 14, 15 ఫైనాన్స్ కమిషన్స్
– సూపర్ సిక్స్ అమలు చేయాలి.. గవర్నమెంట్ నడపాలి.. FIB రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి
– 60% కంప్లైంట్ లు ల్యాండ్ కగ్రాబీయింగ్ మీదనే ఉన్నాయి
– ఫ్రీగా ఇస్తామన్నా.. అమలు చేయాలంటే సవాళ్లుగా ఉంది.. ఇసుక మాఫియా ఉంది.
– గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగింది
– ఎర్రచందనం స్మగ్లర్స్ తయారయ్యారు
– బియ్యం అక్రమ రవాణాపై రూట్ లెవల్ కి వెళ్ళాలి
– పోర్ట్ లు, సెజ్ లు కబ్జా చేస్తున్నారు.. దీనికి కరెక్ట్ చేస్తాం
– 7 శ్వేతా పత్రాలు విడుదల చేశాం..
– 15వేల కోట్లు కేంద్రం ఇచ్చింది.. 16వేల కోట్లు బయట తీసుకున్నాం.. అమరావతికి 31వేల కోట్లు
– పోలవరం 2027 కి పూర్తి చేస్తాం.. కేంద్రం 1200 కోట్లు విడుదల చేసింది
– నరేగా పనులు సంక్రాంతి నుండి ప్రారంభం కావాలి
– 16347 టీచర్స్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం
– 43 వేల స్కూల్స్ లో టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ జరిగింది..రెగ్యులర్ గా నిర్వహించాలి
– తూతూ మంత్రంగా రెవెన్యూ సదస్సులు పెడితే కుదరదు
– ప్రజా సమస్యల పరిష్కార వేదిక పై 4 డిపార్ట్మెంట్ లోనే ఫిర్యాదులు ఉన్నాయి
–
– మనం పెత్తందార్లం కాదు.. ప్రజా సేవకులం
– తూతూ మంత్రంగా సమస్యల పరిష్కరం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
– ఆర్థిక పరిస్థితులను బట్టి అర్హులకు సంక్షేమ పథకాలు ఇస్తాం
– ధాన్యం కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయి.
కలెక్టర్ల సదస్సు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగం
• చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
• ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
• రాష్ట్రానికి గూగుల్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
• గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మూలాలనే పెకలించేసింది. భారీగా అవకతవకలకు పాల్పడింది
• ప్రజలు మనపై బృహత్తర బాధ్యత పెట్టారు. మేము పాలసీలు మాత్రమే తీసుకురాగలం. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్ లే.
• గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు విక్రయం మొదలు.. ఎన్నో పనులు చేయించారు. ఇంతమంది ఐఏఎస్ లు ఉండీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
• గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చింది. నేడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైంది.
• రాళ్లు, రప్పలున్న ప్రదేశంలో చంద్రబాబు సైబరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించారు . ఆయన నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టం.
• మీ అందరి సహకారంతో ప్రజా పాలన అందించాలని మేము కోరుకుంటున్నాం.
• కాకినాడ పోర్టు నుంచి మూడు చెక్ పోస్టులు పెట్టినా బియ్యం అక్రమ రవాణ ఆగడం లేదు
• సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదుల వలన 300 మంది ప్రాణాలు పోయాయి
• మంత్రి మనోహర్ తనిఖీలకు వెళితే సహకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా?
• పాలన అంటే ఏపీలో లాగా ఉండాలని దేశమంతా అనుకోవాలి. అందుకు ఐఏఎస్ లే బాధ్యత తీసుకోవాలి.