స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ విజయవాడలో ఆవిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యంకండి. జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి.
స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ విజయవాడలో ఆవిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యంకండి..
ఈనెల 13న విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఆవిష్కరించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి..
జిల్లా నుండి వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు కావాలి..
ఏర్పాట్లపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి.
ఏలూరు , డిసెంబర్ 11: విజయవాడలో నిర్వహించు స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు జిల్లా నుండి వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి కోరారు. ఈనెల 13వ తేదీ శుక్రవారం విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ను గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తున్న సందర్భంలో జిల్లాస్ధాయిలో ఏర్పాట్లను సంబంధిత అదికారులతో జెసి ధాత్రిరెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం 13వ తేదీ ఉదయం 9.00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం సమయానికి ముగుస్తుందన్నారు. మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో ముఖ్యమంత్రి విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ షో, ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర తదితర 9 జిల్లాల నుండి విచ్ఛేసే వారికి ఏలూరు జిల్లాలో ఆతిధ్యం అందించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. అదే విధంగా ఏలూరు జిల్లానుంచి సుమారు వెయ్యి మంది వరకు ఆయా వర్గాల ప్రజలను 20 బస్సుల్లో ఈ కార్యక్రమానికి హాజరు అయ్యేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఆయా వర్గాలను మన జిల్లా నుండి 13 వ తేదీ ఉదయానికి విజయవాడ తీసుకు వెళ్లడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి డ్వామా పిడి, దెందులూరు తహశీల్దారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం. ముక్కంటి, కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటుచేసి వారి రాకపోకలకు తగిన రవాణా సౌకర్యాలతో పాటు తగిన వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాట్లకు సూచనలిచ్చారు. ప్రతి బస్సుకు ఒక కానిస్టేబుల్, ఒక అధికారికి విధులను కేటాయించడం జరిగిందన్నారు. ప్రతి బస్సుకు సంబంధించి డ్రైవర్ పేరు, ఫోన్ నెంబరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను పటిష్టంగా నిర్వహించాలని, సకాలంలో ఏర్పాట్లు అన్నింటిని పూర్తిచేసి కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని తెలిపారు.
సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు,జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్ .కె. హబీబ్ భాషా, డ్వామా పిడి వెంకట సుబ్బారావు, సోషల్ వెల్ఫేర్ జెడి వి. జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.