Close

జిల్లాలో ఇంతవరకు 132 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహణ.. జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి

Publish Date : 16/12/2024

ఏలూరు,డిసెంబర్,16: భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లాలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అన్నారు. ఏలూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘మీ భూమి… మీ హక్కు’ పేరుతో శుక్రవారం ఏర్పాటుచేసిన రెవిన్యూ సదస్సుల నిర్వహణపై జేసీ వివరాలు తెలియజేసారు. జిల్లాలో 28 మండలాల్లో మొత్తం 665 రెవిన్యూ గ్రామాలుండగా ఇంతవరకు 132 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు.సోమవారం నిర్వహించిన 31 రెవిన్యూ సదస్సుల్లో 824 మంది పాల్గొని ఆయా సమస్యలపై 326 అర్జీలను అందజేశారని, వాటిలో 15 దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందన్నారు. రెవిన్యూ సదస్సులలో అందిన విజ్ఞప్తులను 45 రోజులలోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇంతవరకు నిర్వహించిన 132 గ్రామ రెవిన్యూ సదస్సులకు 6558 మందీ హాజరై 1613 అర్జీలు ఇవ్వగా వాటిలో అక్కడికక్కడే 196 అర్జీలు పరిష్కరించబడ్డాయన్నారు. రెవిన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతీ మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. జనవరి 8వ తేదీ వరకు ఆయా గ్రామల్లో నిర్వహించే రెవిన్యూ సదస్సులలో ప్రజలు పాల్గొని తమ భూములకు సంబందించిన సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలన్నారు.