Close

రాబోవు 2,3 రోజులలో వర్షం కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం భద్రతకు ముందస్తు చర్యలు.. జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి.

Publish Date : 17/12/2024

ఏలూరు, డిశంబరు, 17: తుఫాన్ కారణంగా ఏలూరు జిల్లాలో స్వల్ప మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపద్యములో కోతలు కాబడి కళ్లాల్లో ఉన్న ధాన్యం రక్షణకు ఇప్పటికే 2 వేల టార్పాలిన్లు రైతులకు పంపిణీ చేశామని, మరో 500 టార్పాలిన్లు ముందస్తుగా సిద్ధం చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. వర్షాలకు దాన్యము తడవకుండా కప్పేందుకు ఇంకా అవసరమైన టార్పాలిన్లు కొనుగోలుచేసి అందించబడునన్నారు. వాతావరణ హెచ్చరికల నేపద్యంలో పంట కోత కోసిన ధాన్యాన్ని రైతులు రైసు మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేసుకోవాలని, అరుదల దశలో ఉన్న ధాన్యాన్ని టార్పలిన్లతో కప్పి తడవకుండా భధ్రపర్చుకోవాలన్నారు. రాబోవు 2, 3 రోజులలో పంట కోయదలచుకున్న రైతులు సంబంధిత వ్యవసాయ శాఖ ఆదికారి వారి సూచనల ప్రకారమే కోతలు కోసుకోవల్సిందిగా జిల్లా యంత్రాంగం తరుపున రైతులను కోరుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం వారు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. వాతావరణ హెచ్చరికల నేపద్యంలో జిల్లా లోని ప్యవసాయు మరియు రెవేన్యూ అదికారులు ప్రజలను అప్రమత్తం చేయాలనియు, ధాన్యం రైస్ మిల్లులకు ధాన్యం తరలింపులలో రైతులకు ఏమైనా సమస్యలుంటే దగ్గరలోని వ్యవసాయ, రెవిన్యూ, పౌర సరఫరాల అధికారులను దృష్టికి తీసుకువెళితే పరిష్కరిస్తారన్నారు. రైతులు తమ సమస్యలను 18004256453 లేదా 08812-230448, 7702003584 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేసినట్లతే అధికారులు తగు పరిష్కార చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లాలో వర్షాల నేపథ్యంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని తెలియజేశారు.

జిల్లాలో ఇంతవరకు 242 ధాన్యం కొనుగోలు ద్వారా 32,682 మంది రైతుల ద్వారా 2,54,521.520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కోరిన రైస్ మిల్లుకు తరలించడం జరిగిందన్నారు. ఇంతవరకు రూ. 585.74 కోట్ల విలువైన ధాన్యాన్ని కోనుగోలు చెయగా అందులో ఇప్పటి వరకు రూ. 482.13 కోట్లను రైతుల యెక్క ఆధార్ అనుసందానిత ఖాతాలలో జమ చేయడమైనదని, మరియు మిగిలిన సొమ్ము జమ చేయు ప్రక్రియలో ఉందన్నారు.