Close

జిల్లా కలెక్టర్ వారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఐసిడిఎస్ పిడి పి. శారద..

Publish Date : 18/12/2024

జిల్లా కలెక్టర్ వారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఐసిడిఎస్ పిడి పి. శారద..
ఏలూరు, డిశంబరు, 18: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమితులైన పి. శారద శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమాభివృద్ధికి, అంగన్వాడీల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2013లో గ్రేడ్ వన్ సూపర్వైజర్ గా మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రవేశించిన వీరు 2015లో సిడిపిఓ గా ఎంపిక కాబడి పలు జిల్లాల్లో పనిచేశారు. ఇటీవల అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పదోన్నతి పొంది ఏలూరు జిల్లా ఐసిడిఎస్ పిడిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈమె తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు, సిడిపిఓగా విధులు నిర్వహించారు.