జిల్లాలో ఇంతవరకు 199 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహణ.. జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి
ఏలూరు,డిసెంబర్,18: ఏలూరు జిల్లాలో 28 మండలాల్లో మొత్తం 665 రెవిన్యూ గ్రామాలుండగా ఇంతవరకు 199 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డితెలిపారు.జిల్లాలో బుధవారం నిర్వహించిన 31 రెవిన్యూ సదస్సుల్లో 1168 మంది పాల్గొని ఆయా సమస్యలపై 258 అర్జీలను అందజేశారన్నారు. రెవిన్యూ సదస్సులలో అందిన విజ్ఞప్తులను 45 రోజులలోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇంతవరకు నిర్వహించిన 199 గ్రామ రెవిన్యూ సదస్సులకు 9451 మంది హాజరై 2221 అర్జీలు అందజేశారన్నారు. రెవిన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతీ మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. జనవరి 8వ తేదీ వరకు ఆయా గ్రామల్లో నిర్వహించే రెవిన్యూ సదస్సులలో ప్రజలు పాల్గొని తమ భూములకు సంబందించిన సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలన్నారు.