Close

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలు పరిష్కారం అర్జీదారుని సంతృప్తి చెందేలా ఉండాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 18/12/2024

ఏలూరు,డిసెంబర్ 18: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో(పిజిఆర్ఎస్) లో అందిన అర్జీల పరిష్కారం అర్జీదారుడు సంతృప్తి చెందేలా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. బుధవారం స్ధానిక కలెక్టరేట్ నుంచి పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కార తీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కార తీరును తాము స్వయంగా ఆడిట్ చేస్తామని తెలిపారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా సిఎంఓ, డిప్యూటీ సిఎం కార్యాలయాలకు వివిధ సమస్యల పరిష్కారంపై ప్రజలు అందించిన అర్జీల పరిష్కారంపై జిల్లాస్ధాయిలో పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా పరిష్కారతీరు ఉండాలని స్పష్టం చేశారు. పరిష్కారతీరులో ఎటువంటి లోపం ఉండకూడదని అర్జీలు రీ ఓపెన్ కాకుండా పరిష్కరించాలన్నారు. అర్జీల్లో పేర్కొన్న అంశాలపై క్షుణంగా పరిశీలించి అవసరమైన పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.