Close

ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు చేరువ చేయడమే గుడ్ గవర్నెన్స్ వీక్ ముఖ్య ఉద్దేశం అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

Publish Date : 18/12/2024

ఏలూరు,డిసెంబర్18: ప్రశాసన్ గావోన్ కి ఓర్ – 2024 కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరిగే గుడ్ గవర్నెన్స్ వీక్ (జిజిడబ్ల్యూ) ప్రచార కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను
అదేశించారు.

బుధవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో గుడ్ గవర్నెన్స్ వీక్ (జిజిడబ్ల్యూ) ప్రచార ప్రణాళికపై జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రశాసన్ గావోన్ కి ఓర్ – 2024 కార్యక్రమం నిర్వహణకు జిల్లాలో విస్తృమైన ప్రచారాన్ని, ప్రజల్లో అవగాహనను పెంచాల్సిన అవసరం వుందన్నారు. భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో సాగుతోన్న ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి, పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన పెంచాలన్నారు. సామాన్య ప్రజలకు సమర్థవంతమైన సుపరిపాలన అందించి సకాలంలో వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం అందించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీలు వర్క్ షాపులు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి నిర్వహించాలన్నారు. సుపరిపాలనపై అవగాహన కలిగించే విధంగా విద్యాసంస్థల్లో క్విజ్ ,వ్యాసరచన ,వక్తృత్వ పోటీలను నిర్వహించాలన్నారు. ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి విజయగాధలతో కూడిన వీడియోలను ,ఫోటోలను సంబంధిత పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం సంబంధించి ఆయా జిల్లా అధికారులు సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించిన కనీసం మూడు విజయగాధలను పొందుపరచాలన్నారు. ఈ నెల 23వ తేదీన సుపరిపాలన వారోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా గోదావరి సమావేశం మందిరంలో వర్క్ షాప్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఇంచార్జ్ జెడ్పి సీఈవో , డి ఆర్ డి ఏ పిడి డా. ఆర్. విజయరాజు, సోషల్ వెల్ఫేర్ జె వి. జయప్రకాష్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ, ఐసిడిఎస్ పిడి పి.శారద, డ్వామా పిడి సుబ్బారావు, డిపిఓ అనురాధ, పిడి ఆర్ఐఓ చంద్రశేఖర్, డీపీఆర్వో రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు.