ఈనెల 19 నుంచి 24 వరకు “ప్రశాసన్ గావ్ కి ఒరే” వారోత్సవాలు.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, డిసెంబర్, 19: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే సుపరిపాలన వారోత్సవాల ముఖ్యఉధ్ధేశ్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. గురువారం ఉదయం ” ప్రశాసన్ గావ్ కి ఒరే” సుపరిపాలన పై కేంద్ర పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం అధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ లతో వెబ్ కాస్టింగ్ ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూ ఢిల్లీ నుంచి కేంద్ర పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి వి. శ్రీనివాస్, జాయింట్ కార్యదర్శి సంతా చౌహాన్ లు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు జిల్లా కలెక్టర్ లు పాల్గొన్నారు. స్ధానిక కలెక్టర్ ఛాంబర్ నుంచి కలెక్టర్ కె. వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధత కలిగిన పనితీరు చూపడం ముఖ్యమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పౌరులకి మెరుగైన సుపరిపాలన అందించే క్రమంలో ప్రశాసన్ గావ్ కి ఒరే” కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజా సమస్యలు పరిష్కార వేదిక ప్రతి సోమవారం నిర్వహిస్తూ, జవాబుదారీతనం ఉండేలా సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకూ ప్రశాసన్ గావ్ కి ఒరే క్యాంపెయిన్ మరియు గుడ్ గవర్నెన్స్ వీక్ నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా అధికారులతో మరియు మండల స్థాయి వరకు పనిచేసి, సుపరిపాలన నమూనాను ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించిన మొత్తం ప్రభుత్వ విధానం ను ప్రజలకి చెరువచేసి మెరుగైన సేవలు అందించాలన్నారు.