Close

యువ ఉత్సవ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ యువత జాతీయ స్థాయిలో రాణించాలి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

Publish Date : 21/12/2024

ఏలూరు డిసెంబర్ 21: ఈనెల 27న నిర్వహించే జిల్లా యువ ఉత్సవాల్లో యువత తమ ప్రతిభ పాటవాలను నిరూపించుకోవాలని
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపు నిచ్చారు.

శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ, జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఉత్సవ్ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా స్థాయి యువ ఉత్సవాలలో యువత పాల్గొని ఆయా రంగాల్లో తమ ప్రతిభ పాటవాలను నిరూపించు
కోవాలన్నారు. యువతలో దాగివున్న ప్రతిభను వెతికి తీసే లక్ష్యంతో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వశాఖ , నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యం లో ఆదిత్య డిగ్రీ కాలేజ్ నందు ఈనెల 27న యువ ఉత్సవ పేరుతో వివిధ పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.ఈ యువ ఉత్సవ్ లో ( ఇండియా @2047 ) అనే అంశం పై వకృత్వ, పెయింటింగ్ , కవిత్వం , మొబైల్ ఫొటోగ్రఫీ విభాగాలలో వ్యక్తిగత పోటీలు మరియు సాంస్కృతిక సాంప్రదాయ(గ్రూప్) , జానపద ( గ్రూప్ ) , సైన్స్ ఎగ్జిబిషన్ మేళా పోటీలలో గ్రూప్ మరియు వ్యక్తిగత పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలో విజేతలను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పంపబడునని, గెలు పొందిన విజేతలకు ప్రథమ ,ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు,సర్టిఫికెట్లు అందజేయబడతాయన్నారు. కావున జిల్లా లోని యువత ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని ,అలాగే యువ ఉత్సవ్ లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలనీ ఆమె కోరారు.

నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి దూలం కిషోర్ మాట్లాడుతూ యువ ఉత్సవ్ లో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ లింక్
https://forms.gle/oLoQPb7CN3nfxcPf9 ను ఉపయోగించు కోవాలన్నారు. ఇతర వివరాములకు 99488 98437 మొబైల్ నెంబర్ నందు సంప్రదించాలన్నారు .