జిల్లాలో ఇంతవరకు 408 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహణ. ప్రజల నుంచి 17,406 అర్జీలు స్వీకరణ. జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి.
Publish Date : 27/12/2024
ఏలూరు,డిసెంబర్,27: ఏలూరు జిల్లాలో 28 మండలాల్లో మొత్తం 665 రెవిన్యూ గ్రామాలుండగా ఇంతవరకు 408 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డితెలిపారు.జిల్లాలో శుక్రవారం నిర్వహించిన 34 రెవిన్యూ సదస్సుల్లో 947 మంది పాల్గొని ఆయా సమస్యలపై 313 అర్జీలను అందజేయగా వాటిలో అప్పటికప్పుడే 81 అర్జీలు పరిష్కరించడం జరిగిందన్నారు. రెవిన్యూ సదస్సులలో అందిన విజ్ఞప్తులను 45 రోజులలోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన 408 గ్రామ రెవిన్యూ సదస్సులకు 17,406 మంది హాజరై 4,314 అర్జీలు అందజేయగా ఇప్పటికే 1,269 అర్జీలు పరిష్కరింపబడ్డాయన్నారు. జనవరి 8వ తేదీ వరకు ఆయా గ్రామల్లో నిర్వహించే రెవిన్యూ సదస్సులలో ప్రజలు పాల్గొని తమ భూములకు సంబందించిన సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలన్నారు.