Close

ఉంగుటూరు మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన..

Publish Date : 31/12/2024

ఏలూరు/ఉంగుటూరు, డిశంబరు, 31: ఉంగుటూరు మండలంలో మంగళవారం స్ధానిక శాసన సభ్యులు పత్సమట్ల ధర్మరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉంగుటూరులో రూ. 12 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ లైన్ ను శాసన సభ్యులు ధర్మరాజుతో కలిసి ప్రారంభించారు. ఉంగుటూరు రైల్వేగేటు అవతల లో ఓల్టేజీతో ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా కొత్త ట్రాన్స్ ఫార్మర్ కు నిధులు మంజూరు చేశారు. లోఓల్టేజి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. చేబ్రోలు గాంధీనగర్ లో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డును కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించి రోడ్డు నాణ్యతను, రోడ్డు మందాన్నికొలిచి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గ్రామంలో సిమెంట్ రోడ్డును ఎంతో నాణ్యతగా నిర్మించడంపై కాలనీ వాసులుకూడా సంతోషం వ్యక్తం చేశారు. చేబ్రోలులో హౌసింగ్ కాలనీని సందర్శించి అక్కడ గృహనిర్మాణాల తీరును కలెక్టర్ వెట్రిసెల్వి, శాసన సభ్యులు ధర్మరాజు పరిశీలించారు.
అనంతరం రాచూరు గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్డు బాగా ఇరుకుగా ఉండటాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ ఆ రోడ్డును విస్తరించేందుకు తగుచర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాచూరు గ్రామసెంటర్ ను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన భూసేకరణకు ప్రతిపాధనలను రోడ్డు భధ్రతా కమిటీకి సమర్పించాలని ఆర్ అండ్ బి ఎస్ఇ జాన్ మోషేను కలెక్టర్ ఆదేశించారు.
వీరి వెంట ఎంపిపి గంటా శ్రీలక్ష్మీ, ఉంగుటూరు, చేబ్రోలు సర్పంచ్ లు బండారు సింధూ,లక్ష్మీసునీత, డిపివో కె. అనురాధ, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ త్రినాధ్ బాబు, పంచాయితీరాజ్ ఎస్ఇ ఐ. మల్లేశ్వరి, హౌసింగ్ పిడి సత్యనారాయణ, ఇన్ చార్జి తహశీల్దారు వై. పూర్ణచంద్రప్రసాద్, ఎంపిడివో జి. రాజ్ మనోజ్, విద్యుత్, హౌసింగ్, తదితర శాఖల అదికారులు పాల్గొన్నారు.