Close

పత్తేపురం ఆర్ అండ్ బి రోడ్డు మరమ్మత్తు పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పి. ధర్మరాజు.

Publish Date : 31/12/2024

ఏలూరు/నిడమర్రు, డిశంబరు, 31: ఏలూరు జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మొదట విడతగా 983 సిసి రోడ్లు నిర్మాణానికి 92.02 కోట్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం నిడమర్రు మండలం చిననిండ్రకొలనులో రూ. 40 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలను ఉంగుటూరు శాసన సభ్యులు పి. ధర్మరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 983 సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.92.02 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. పురోగతిలో ఉన్న పనులు డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం ఊర చెరువును పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ వాకింగ్ ట్రాక్, పార్కు ఏర్పాటు చేయాలని శాసన సభ్యులు ధర్మరాజు జిల్లా కలెక్టర్ ను కోరారు. తదుపరి జెడ్పి హైస్కూల్ గ్రౌండ్ ను పరిశీలించారు. క్రీడా అభివృద్ధిలో భాగంగా గ్రౌండ్ కు వెళ్లే మార్గాన్ని సిసి రోడ్డుగా నిర్మించాలని కోరగా అందుకు సంబంధించిన ప్రతిపాధనలు సమర్పించాలని తెలిపారు. గ్రామాన్ని మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పత్తేపురంలో మరమ్మత్తులు చేపట్టిన ఆర్ అండ్ బి రోడ్డు పనులను కలెక్టర్ వెట్రిసెల్వి తనిఖీ చేశారు. రోడ్డుకు ఇరువైపులా మంచినీటి కాల్వకు రిటైనింగ్ వాల్ ను ఏర్పాటు చేయాలని స్ధానిక శాసన సభ్యులు కలెక్టర్ వారిని కోరారు.
వీరి వెంట స్ధానిక మండల అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.