22-ఎ భూములు పై రీ సర్వే పునఃప్రారంభం.. ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో భూమి రీ సర్వే
ఏలూరు, జనవరి, 4: జిల్లాలో 22-ఎ భూములకు సంబంధించి భూముల రీ సర్వే పునఃప్రారంభించడానికి ఏలూరు డివిజన్ కు సంబంధించి 7గురు తహశీల్దార్లను బృందాలుగా ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఏలూరు డివిజన్ కు సంబంధించి 22-ఎ భూముల తొలగింపుకు సంబంధించి ఏలూరు డివిజన్ లోని మండలాలకు సంబంధించి రీ సర్వేపునఃప్రారంభానికి శిక్షణా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ 22-ఎ భూముల రీ సర్వేకు సంబంధించి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం గ్రామ సభలు నిర్వహించాలన్నారు. ఈ రీ సర్వేకు కమిటీ బృందాలుగా 7గురు తహశీల్దార్లను నియమించామని తెలిపారు. ఈ మాసంలో ఏలూరు డివిజన్ లో కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాలకు సంబందించిన 22-ఎ భూముల రీ సర్వే ప్రక్రియను ప్రారంభించి త్వరితగతిన పూర్తిచెయ్యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు మండలాలకు సంబంధించి 7 గురు తహశీల్దార్లను కమిటీ ప్రధానులుగా ఏర్పాటు చేయడం జరిగిందని వీటిలో కలిదిండి మండలం భాస్కరరావుపేట, గురవయ్యపాలెం, కలిదిండి కు సంబంధించి ఎ. శ్రీనివాస్(ఏలూరు రూరల్), కలిదిండి కి బి. రమాదేవి(భీమడోలు), ఎల్.వి.ఎస్. రామకృష్ణ(కలిదిండి)లు, ఉనికిలి,వారవాక,వడలి లకు సంబంధించి వై. పూర్ణచంద్రప్రసాద్(ఉంగుటూరు), కె. గోపాల్(మండవల్లి), ఎ. కృష్ణజ్యోతి(పెదపాడు), సుభానీ(ముదినేపల్లి)లు రీ సర్వేకు నియమించినట్లు తెలిపారు. వీరితోపాటు విఆర్ఓలు, ఆర్ డిటిలు ఉంటారని తెలిపారు. రీ సర్వేకు ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్ పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఈ మండలాల్లో 22-ఎ భూములకు సంబందించి గ్రామ సభలు నిర్వహించడానికి ముందు రైతాంగానికి తెలిసేలా టాం టాం లు తదితర మాధ్యమాల ద్వారా సమాచారాన్ని అందించాలన్నారు. రీ సర్వే 15 రోజుల్లోగా పూర్తిచేసేలాగా కేటాయించిన బృందం కృషి చేయాలన్నారు. రీ సర్వే రోజువారీ నివేదికను సమర్పించవలసివుంటుందని తెలిపారు. రీ సర్వే నాణ్యతతో పకడ్బందీగా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రీ సర్వేకు సంబంధించిన సందేహాలు ఉంటే ఏలూరు ఆర్డిఓ ని సంప్రదించాలని తెలిపారు.
కార్యక్రమంలో ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, తహశీల్దార్లు, పరిపాలనా విభాగం సూపరింటెండెంట్లు, విఆర్ఓలు, ఆర్ డిటిలు పాల్గొన్నారు.