పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులలో స్పూర్తిని నింపిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, జనవరి, 7: పదోతరగతి పరీక్షలకు నూరు శాతం విద్యార్థులు హాజరవ్వాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నుంచి కలెక్టర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని 249 ప్రభుత్వ, జిల్లాపరిషత్ హైస్కూల్లోని పదోతరగతి విద్యార్ధులతో మార్చి నెలలో నిర్వహించే పదోతరగతి పరీక్షలకు సంబంధించిన అంశాలపై విద్యార్థినీ, విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి, వారిలో పరీక్షలంటే ఉన్న భయాన్ని పోగొట్టి, వారిలో స్ఫూర్తి ని నింపారు. ఈ సందర్భంగా కలక్టర్ వెట్రిసెల్వి విద్యార్ధులను ఉద్ధేశించి మాట్లాడుతూ 23 వేల మంది విద్యార్ధులు పదోతరగతి పరీక్షలకు జిల్లాలో పరీక్షలకు హాజరుకానున్నారని, నూరుశాతం విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. . పదోతరగతి పరీక్షల ఉత్తీర్ణతలో రాష్ట్రంలో ఏలూరు జిల్లా ప్రధమస్ధానం సాధించేలా విద్యార్ధులసమాయత్తం చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పరీక్షలకు ఇంకా 60 రోజులు ఉన్నాయని భయపడకుండా రెండు నెలలు ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు పాటిస్తే తప్పకుండా అందరూ ఉతీర్ణులు అవుతారని, కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ రెండు నెలలు విద్యార్ధులు టి.వి.లు, ఫోన్ లకు దూరంగా ఉండి పదోతరగతికి సంబంధించిన టెక్స్ బుక్స్ తోపాటు సపోర్టుగా ఇచ్చిన విజయకేతనం మెటీరియల్ పుస్తకాన్నిబాగా అభ్యసిస్తే మంచిమార్కులతో ఉత్తీర్ణులవుతారని కలెక్టర్ విద్యార్ధులకు సూచించారు. విద్యార్ధులు పరీక్షల గురించి ఆంధోళన, భయంను విడనాడి రోజూ ఉదయం, సాయంత్రం బీతింగ్ ఎక్సర్ సైజ్ చేసి మంచి ఆహారాన్ని, ఎక్కువ మంచినీరు త్రాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక క్లాసుల ద్వారా భోదిస్తున్న పాఠాలను క్షుణంగా అభ్యాసించాలని అన్నారు. ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ తదితర ఉద్యోగాలకు ముందుమెట్టు పదోతరగతి ఉత్తీర్ణతేనని వీటిలో మంచి మార్కులు సంపాదిస్తే భవిష్యత్ 20 సంవత్సరాల్లో మీరు కోరుకున్న ఉన్నత విద్యను పొందవచ్చని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్ధులకు ఈ రెండు నెలల్లో ఉపాధ్యాయులు వారిపై ప్రత్యేకమైన శ్రద్ధచూపి ఉత్తీర్ణత పొందేలాగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం స్కూల్ విద్యార్ధులతో మాట్లాడుతూ వారియొక్క స్పూర్తిని సంకల్పాన్ని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుక్కునూరుకు సంబంధించి ట్రైబల్ బాలికల పాఠశాలలో విద్యార్ధులకు నోట్ బుక్స్ పంపించడానికి ఆదేశాలు ఇచ్చారు.
సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ, ప్రభృతులు పాల్గొన్నారు.