Close

జిల్లాలో నూతనంగా ఎన్నిక కాబడిన జిల్లా సమాఖ్య, ఏలూరు జిల్లా పాలకవర్గ సభ్యులు మంగళవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు.

Publish Date : 07/01/2025

ఏలూరు, జనవరి, 7: జిల్లాలో నూతనంగా ఎన్నిక కాబడిన జిల్లా సమాఖ్య, ఏలూరు జిల్లా పాలకవర్గ సభ్యులు మంగళవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసే ఉత్పత్తులు e-commerce (ONDC) ద్వారా మార్కెటింగ్ జరిగేలా చూడాలని, ఉల్లాస్ కార్యక్రమములో పాల్గొని వయోజన విధ్య కొరకు మరింత కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్. విజయరాజు, జిల్లా సమాఖ్య అధ్యక్షులు పూసం గంగా రత్నం, ఉపాధ్యక్షురాలు ఆవుల స్వర్ణ కుమారి, కార్యదర్శి తోట కృపామణి, సహాయ కార్యదర్శి సయ్యద్ సుల్తానా, కోశాధికారి గోళ్ళ శాంత కుమారి ప్రభృతులు పాల్గొన్నారు.