Close

పౌర సరఫరాను సక్రమంగా నిర్వహించేందుకు సహకరించండి.. జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి..

Publish Date : 07/01/2025

ఏలూరు, జనవరి, 7: సివిల్ సప్లైయి సక్రమంగా నిర్వహించేందుకు డీలర్లంతా కృషి చేయాలని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సూచించారు. ఏలూరు జిల్లా డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళవారం ఏలూరు జిల్లా అధికారులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత డిఎస్ఓ సత్యనారాయణ రాజు, పౌర సరఫరాల జిల్లా మేనేజరు వి. శ్రీలక్ష్మి, ఏఎస్ఓ ప్రతాప్ రెడ్డి లను కలిసి అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో జిల్లా ముఖ్య కార్యదర్శి అత్తలూరి ఉదయశ్వరరావు, ఉపాధ్యక్షుడు కొలుసు లక్ష్మణరావు , కోశాధికారి కే నాగరాజు, జాయింట్ సెక్రెటరీ బి కోటేశ్వరరావు, గిరి ,నూజివీడు ఏసు, మహిళా అధ్యక్షరాలు పిల్లా రాజరాజేశ్వరి, హరికృష్ణ, భాషా తదితరులు ఉన్నారు.