Close

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పధకం కింద అర్హులైన ప్రతీ ఒక్కరికీ రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లు, అధికారులను ఆదేశించారు.

Publish Date : 08/01/2025

ఏలూరు, జనవరి, 8 : ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పధకం కింద అర్హులైన ప్రతీ ఒక్కరికీ రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లు, అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం పీఎం విశ్వకర్మయోజన పధకం అమలుపై అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పీఎం విశ్వకర్మయోజన పధకం కింద 18 సాంప్రదాయక చేతివృత్తులకు వారి ఆర్ధిక చేయూతకు రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని, జిల్లాలో పీఎం విశ్వకర్మయోజన పధకం కింద 2458 మందికి మంజూరు చేసి శిక్షణ అందించడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులలో అర్హులైన వారికి రుణాలు అందించేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు, పరిశ్రమల శాఖ జీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్, జిల్లాపంచాయతి అధికారి కె. అనురాధ, ప్రభృతులు పాల్గొన్నారు.