డివైడర్ల సుందరీకరణ లో భాగంగా పెయింటింగ్ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బడేటి రాధకృష్ణయ్య (చంటి) , జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి
ఏలూరు,జనవరి 12:
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్వచ్ఛభారత్ భారత్ లో భాగంగా మన ఏలూరు మన పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏలూరు పట్టణ సుందరీకరణలో భాగంగా ఆదివారం ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధ కృష్ణయ్య (చంటి) , జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి , కోప్షన్ సభ్యులు ఎస్ యం ఆర్ పెదబాబు లతో పాటు పలువురు వాలంటరీలు సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది కలిసి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ఉన్న డివైడర్ను నుండి ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ ఆఫీసు వద్ద వరకు ఉన్నటువంటి డివైడర్లను సుందరీకరణ లో భాగముగా పెయింటింగ్ కార్యక్రమం లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు రాధా కృష్ణయ్య (చంటి )మాట్లాడుతూ మన ఏలూరు మన పరిశుభ్రతకు సంబంధించి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. తద్వారా మన నగరాన్ని సుందరీకరణ చేసుకోవాలన్నారు. వ్యాపారస్తులు నగరవాసులు మనమే పరిశుభ్రంగా ఉంచుకొని నగరాన్ని ఆహ్లాదకరంగా ఉంచేందుకు కృషి చేద్దామన్నారు. ఇష్టానుసారం వాల్ పోస్టర్లు వ్రాతలతో ఎక్కడబడితే అక్కడ చేసే కార్యక్రమాలను నిలుపుదల చేయాలని లేని పక్షంలో మొదటి విడతగా జరిమానా విధించడం జరుగుతుందని రెండోసారి అటువంటి చర్యలు కనబడితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు ఖర్చు చేసి నగర సుందరి గాని తీసే కార్యక్రమాలు చేస్తుంటే వాటిని బాధ్యతారహితంగా పాడు చేస్తే ఊరుకునేది లేదన్నారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రీసెల్వి మాట్లాడుతూ మన నగరం మన ఆస్తి అనే సామాజిక స్పృహతో ఏలూరు నగర అభివృద్ధి, సుందరీకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఏలూరుగా హేలపూరి నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. విచ్చలవిడిగా గోడలపై, రోడ్ల డివైడర్లు పై పోస్టర్లు, ఇతర రాతలతో నగర అందాన్ని చెడగొట్టవద్దని హితువు పలికారు. ఏలూరు సుందరీకరణకు, నగరాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందన్నారు.
జిల్లా ఎస్పీ కె. పి.ఏస్.కిషోర్ మాట్లాడుతూ పరిశుభ్రమైనటువంటి నగరంగా ఏలూరును తీర్చిదిద్దేందుకు ఇటువంటి సుందరీ కారణమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు.
మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవచ్చునన్నారు. ప్రజలందరూ తమ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సుందరీకరణమైనటువంటి పనులను చేయడమే కాదు దాన్ని కాపాడుకోవడం కూడా ప్రజల యొక్క బాధ్యతని పేర్కొన్నారు. గౌరవ ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్లో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ గా ఏలూరు నగరం ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలలో పోలీసు వారి యొక్క పూర్తి సహాయ సహకారాలను అందిస్తామన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త శుద్ధి పనుల్లో దేశానికే ఏలూరు నగరం ఆదర్శంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ పాటుపడలన్నారు. ప్రభుత్వం ఎన్నో లక్షలు వెచ్చించి నగర సుందరీకరణ పనులు చేపట్టి ఆకర్షణీయంగా
తీర్చిదిద్దుతోందన్నారు. పలువురు విచ్చలవిడిగా అనధికార
హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, డిజిటల్ బ్యానర్లతో నగర అందాన్ని
చెడగొడుతున్నారని అటువంటి చర్యలకు పాల్పడే వారిపై 1997 యాక్ట్ ప్రకారం నగర
సుందరీకరణకు ఆటంకం కల్గించే వారిపై నగరపాలక సంస్థ,పోలీసు వారు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఏలూరు డిఎస్పి శ్రీ డి శ్రావణ్ కుమార్ ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటీశ్వరరావు, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఈడ డిఈఈ ఎన్.రామారావు, సిబ్బంది భూషణం,శ్రీకాంత్,పాండురంగారావు,ఏలూరు నగర పాలక సంస్థ మేనేజర్ సి హెచ్. వి.మూర్తి, డిఇఇ వి.తాతబ్బాయి,సాంబశివరావు,రాజేష్,శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏడుకొండలు, స్టీఫెన్ రాజు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.