Close

ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు.. వడ్డే ఓబన్న కు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 11/01/2025

ఏలూరు,జనవరి 11: స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218 వ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శనివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముందుగా జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి ,జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ చరిత్రలో వడ్డే ఓబన్న జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వీరి సేవలను గుర్తించి రాష్ట్రప్రభుత్వంతొలి
సారిగా అధికారికంగాజయంతి
వేడుకలునిర్వహించుకోవడం శుభపరిణామం అని అన్నారు. వడ్డే ఓబన్న త్యాగాలు భావి
తరాలకు స్ఫూర్తిదాయ
కమన్నారు. ఆనాడు వడ్డే
ఓబన్న బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం చేసిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారని తెలిపారు. 1857 లో జరిగిన స్వాతంత్ర ఉద్యమానికి ముందు భారతదేశంలోని బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనలో వడ్డే ఓబన్న కీలకపాత్రవహించారని పేర్కొన్నారు. పేద రైతుల హక్కులను కాపాడడానికి, ముఖ్యంగారైతులపైఅధికపన్నులు విధించడం పట్ల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన యోధుడన్నారు. వడ్డే ఓబన్న ప్రజల కోసం రైతుల కోసం బ్రిటిష్ పాలన కు వ్యతిరేకంగా చేసిన త్యాగం ,దేశభక్తి, ధైర్యం ప్రజల హృదయాలలో నిలిచిపోయిందని ఆయన జాతికి చేసిన సేవలు మరువరానివని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, బి. సి. కార్పొరేషన్ ఈడీ ఎన్. పుష్పలత,డీ ఈఓ వెంకటలక్ష్మమ్మ, పశుసంవర్ధ శాఖ జాయింట్ డైరెక్టర్ గోవిందరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాంచారయ్య, కలెక్టరేట్ సిబ్బంది ప్రభూతులు పాల్గొన్నారు