Close

రెవిన్యూ సదస్సుల్లో, రీసర్వే గ్రామ సభల్లో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 22/01/2025

ఏలూరు, జనవరి, 22: రెవిన్యూ సదస్సుల్లో, రీసర్వే గ్రామ సభల్లో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో వివిధ రెవిన్యూ అంశాలపై ఏలూరు డివిజన్ తహశీల్దార్లు, రెవిన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో రీసర్వే గ్రామసభలలో వచ్చిన అర్జీల నమోదు మరియు పరిష్కారము, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల నమోదు, పరిష్కార ప్రక్రియ పురోగతి, 22a కేసుల స్థితి, వెబ్ ల్యాండ్ పోర్టింగ్/కరెక్షన్ కేసుల స్థితి, పిజిఆర్ఎస్ ఫిర్యాదులు స్థితి, ల్యాండ్ బ్యాంక్ పురోగతి, ఎపిసేవా, మీసేవలో పెండింగ్‌లో ఉన్న బిఎస్ఎల్ఎ కేసుల క్లియరెన్స్ స్థితి , పునః సర్వేపై స్థితి,భూసేకరణ మరియు భూమి అన్యాక్రాంతం కేసులపై స్థితి తదితర అంశాలపై సమీక్షించారు. ఈ అంశాలకు సంబంధించి త్వరితగతిన పురోగతి సాధించాలని ఆదేశించారు.
సమావేశంలో ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, తహశీల్దార్లు, రి-సర్వే డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టట్ సర్వే హాజరయ్యారు.