Close

మార్చ్, 31 లోగా 5 లక్షల మంది అసంఘటిత కార్మికులను నమోదు చేయాలి- అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం

Publish Date : 25/01/2025

ఏలూరు, జనవరి, 25 : జిల్లాలో అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులను ప్రతీ ఒక్కరిని ‘ఈ-శ్రమ్’ పోర్టల్ నందు మార్చ్, 31 వ తేదీ లోగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.

స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమేవేశపు హాలులో శనివారం అసంఘటిత కార్మికులను ‘ఈ-శ్రమ్’ పోర్టల్ నందు నమోదు కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 5 లక్షలకు పైగా అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వారికి సామజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పధకాలను అందించేందుకు వారందరినీ ‘ఈ-శ్రమ్’ పోర్టల్ నందు నమోదు చేయవలసి ఉందన్నారు. ఈ పధకంలో చేరేందుకు 16 నుండి 59 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలని, ఆదాయపు పన్ను చెల్లించనివారు, ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ మరియు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్సు సదుపాయం లేనివారు అర్హులన్నారు. ‘ఈ-శ్రమ్’ పోర్టల్ నందు నమోదైన ప్రతీ కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన కింద 2 లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా సౌకర్యం ఉచితంగా కల్పించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ మరియు అనుబంధ ఉపాధి పనివారు, చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, నర్సరీలు, ఉద్యానవనాలు పనివారు, పాడిపరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, భవన నిర్మాణం, అనుబంధ రంగాలలో పనిచేసే తాపీ , తవ్వకం, రాళ్లు కొట్టేపని, సెంటరింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, సానిటరీ, పెయింటర్, టైల్స్, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, ఇటుక సున్నం బటీలు, రిగ్గర్లు, కాంక్రీట్ మిక్సర్, బావులు తవ్వడం, పూడిక తీత ,తైలారింగ్, అర్థ మొబైల్,రవాణా రంగంలోని డ్రైవర్లు, హెల్పర్లు, చేతివృత్తులు, కులవృత్తుల ఉపాధి హామీ, ఆశా వర్కర్లు, స్వయంసహాయక సంఘాలు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పధకం పనివారు, తదితర అసంఘటిత రంగంలో పనిచేసే ప్రతీ ఒక్కరూ అర్హులన్నారు. నమోదుకు అవసరమైన సమాచారంతో దగ్గరలో గ్రామ/ వార్డ్ సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, లేదా మొబైల్ నుండి www.eshram.gov.in వెబ్సైటు లో వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో ఉపాధి హామీ, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, పంచాయతీ రాజ్, రహదారులు, భవనాలు, ఆర్ డబ్ల్యూ ఎస్., పురపాలక సంఘాలు, తదితర శాఖల పరిధిలో పనిచేసే నిర్మాణ కూలీలు, పారిశుధ్య కార్మికులు, వీధి వ్యాపారులు, అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నవారందరినీ ‘ఈ-శ్రమ్’ పోర్టల్ నమోదు ఆవశ్యకతపై సంబంధిత శాఖల అధికారులు, ట్రేడ్ యూనియన్ నాయకులు అవగాహన కలిగించి, మార్చ్, 31 వ తేదీ లోగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సమావేశంలో కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ పి . శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, డి.ఆర్.డి. ఏ ., పీడీ ఆర్. విజయరాజు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమీషనర్ జి. నాగేశ్వరరావు, డ్వామా పిడీ సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారి కె.అనురాధ, వ్యవసాయశాఖాధికారి హబీబ్ భాషా, ఐసిడిఎస్ పిడి శారద,గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ, డీఈ ఓ వెంకట లక్ష్మమ్మ, బిసి కార్పొరేషన్ ఈడి ఎన్.పుష్పలత, కార్మిక సంఘాల ప్రతినిధులు డి ఎన్ .వి.డి. ప్రసాద్, డాంగే ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.