Close

ఏలూరు లో ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు.. 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 25/01/2025

ఏలూరు, జనవరి 25: ఏలూరు,జనవరి 25:ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి శనివారం స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో “జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని” పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి, జిల్లా అధికారులు,విద్యార్థులు, కలెక్టరేట్ సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలని, ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. ప్రజాస్వామ్య దేశం లో ఓటు హక్కు ఎంతో విలువైనదని,ఓటు హక్కు కు ఉన్న విలువ ను ఓటర్లు తెలుసుకొని వారి అమూల్య మైన ఓటు హక్కు ను వినియోగించుకోవాలని తెలిపారు. ఓటుహక్కుపై అవగాహన కల్పించాలని, ఓటు హక్కు ద్వారా సమర్థ వంతమైన పాలనను ఏర్పాటు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. 2011 సం. లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని, ఈ సంవత్సరం 15 వజాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 16,37,555 ఓటర్లుగా నమోదయి వున్నరన్నారు. వీరిలో 7,99,283 మంది పురుషులు,8,38,146 మంది మహిళలు,126 మంది థర్డ్ జండర్ ఉన్నారన్నారు. అదేవిధంగా 2024 తుది ఓటర్ల జాబితా నాటినుంచి 2025 తుది ఓటర్ల జాబితా సవరణ నాటికి 18-19 వయస్సు గల యువ ఓటర్లు 24,735 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, దివ్యాంగుల ఓటర్లు 19,970 మంది, ఎలక్ట్రోల్స్ నమోదు చేయబడిన స్త్రీలు 1049 మంది, 1000 మంది పురుషులు జిల్లాలో కలిగియున్నారన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం ప్రతి సంవత్సరం జనవరి 1, ఏప్రిల్, 1, జూలై, 1, అక్టోబరు 1న జరుగుతుందని చెప్పారు. ఓటరు నమోదు కార్యక్రమం బిఎల్ఓల ద్వారా కానీ సంబంధిత తహశీల్దారు కార్యాలయంలో గానీ, స్ధానిక అంగన్వాడీ కార్యకర్తలు ద్వారా గానీ, డైరెక్ట్ గా Nvsp.in వెబ్ సైట్ లో గానీ ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా గానీ, కలెక్టరేట్ లో ఉన్న 1950 కాల్ సెంటర్ ద్వారా గానీ ఫారం-6ఎ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
కార్యక్రమానికి ముందు విద్యార్ధినీలతో ఓటుయొక్క ప్రాముఖ్యతపై సాంస్కృతికి కార్యక్రమం, ప్రసంగం నిర్వహించారు. అనంతరం సీనియర్ సిటిజన్ ఓటరులయిన దేవరపల్లి కుటుంబరావు, బి. దమయంతి, ఇందుకూరు వెంకటలక్ష్మీపతిరాజు లను కలెక్టర్ సన్మానించారు. తదుపరి కొత్తగా ఓటరుగా నమోదైన యువతకు ఓటరు ఐడి కార్డులను, ఓటరు దినోత్సవం సందర్బంగా కళాశాలల్లో, పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, వత్కృత్వ, రంగవల్లుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, సర్టిఫికెట్లను కలెక్టర్ అందజేశారు.
తొలుత గోదావరి సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ఓటరు నమోదు, నమూనా మోడరన్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు,ఆర్డీవో అచ్యుత అంబరీష్,జడ్పీ సీఈవో కె.సుబ్బారావు, డిఆర్ డిఎ పిడి ఆర్.విజయరాజు ,సెట్ వెల్ సీఈవో కె.ప్రభాకరరావు,తహసిల్దార్ శేషగిరి,కలెక్టరేట్ ఏవో నాంచార్య,వివిధ శాఖల అధికారులు,విద్యార్థులు పాల్గొన్నారు.