Close

గుండుగొలనుకుంట గ్రామం, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు జిల్లాకు చెందిన ఓబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి కి జాతీయ స్తాయి గుర్తింపు లభించింది. ఈ సందర్బంగా శుక్రవారం సాయంత్రం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని ఓబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Publish Date : 24/01/2025

ఏలూరు, జనవరి, 24: గుండుగొలనుకుంట గ్రామం, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు జిల్లాకు చెందిన ఓబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి కి జాతీయ స్తాయి గుర్తింపు లభించింది. ఈ సందర్బంగా శుక్రవారం సాయంత్రం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని ఓబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా జైవిక్ ఇండియా అవార్డు-2025ను అందుకున్న గోపాలకృష్ణమూర్తిని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర ప్రకృతి వనరులు మరియు శిక్షణా కేంద్రం ద్వారా కషాయాలు తయారుచేస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆయనకు అంతర్జాతీయ యోగ్యత కేంద్రం, జైవిక్ ఇండియా అవార్డు-2025ను ప్రకటించింది. ఈ నెల 22న బెంగుళూరులో నిర్వాహకుల నుండి అవార్డ్ అందుకున్నారు. అదే విధంగా ఓబిలిశెట్టి గోపాల కృష్ణ మూర్తి ని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకులు, షేక్ హబీబ్ భాషా, ఏలూరు జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్, బి. వెంకటేష్ కూడా అభినందించారు.