పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ధారణ.
ఏలూరు, జనవరి 24: 2025-26 కు సంబంధించి వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను నిర్ధారించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లాస్ధాయి సాంకేతిక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వ్యవసాయ, మత్స్యశాఖ, ఉధ్యాన, పశుసంవర్ధకశాఖలకు సంబంధించి వివిధ రకాల రుణాల మంజూరుకోసం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను నిర్ధారించినట్లు చెప్పారు. వివిధ పంటలు, పాడిపశువుల పెంపకానికి, చేపల పెంపకానికి సంబంధించి పెంచిన రుణపరపతి వివరాల ప్రతిపాధనలను రాష్ట్రస్ధాయి సాంకేతిక కమిటీకి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిసిసిబి సిఇఓ ను ఆదేశించారు.
సమావేశంలో డిసిసిబి సిఇఓ తిలక్ నారా, నాబార్డ్ డిడిఎం పి. అనీల్ కాంత్,ఎల్ డిఎం డి. నీలాధ్రి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్.కె. హబీబ్ భాషా, ఉద్యానశాఖ డిడి ఎస్. రామ్మెహన్, సెరీకల్చర్ డిడి డి. వాణి, ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, కూరగాయల రైతుసంఘం జిల్లా ప్రెసిడెంట్ కట్టా భాస్కరరావు, కొబ్బరి రైతు సంఘం నాయకులు ఘంటా పాపారావు, పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్ అధికారులు, పలువురు బ్యాంకు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.