జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్..
ఏలూరు,జనవరి 24: జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు వాహనాలపై వచ్చే ఉద్యోగులు ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావల్సిందేనని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు.
శుక్రవారం సాయంత్రం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్ధాయి రోడ్డు భధ్రతా కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కె.పి. ఎస్. కిషోర్ తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రహదారి భధ్రతా, రోడ్డు భధ్రతా వారోత్సవాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ వాహన చోధకుల నిర్లక్ష్యం,ఇతర కారణంగా ప్రమాదాలతో వారి కుటుంబాలకు తీవ్ర మనోవేధనకు గురిచేస్తున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని రోడ్డు భధ్రతా నియమాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఇప్పటికే ఈవిషయంపై అన్నిస్ధాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. హెల్మెట్ ధారణపై మరింత విస్త్రృత చర్యల్లోభాగంగా తొలిగా ప్రభుత్వ కార్యాలయాలకు వాహనాలపై వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలనే నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమలు అమలు చేయాలన్నారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భధ్రతా నిబంధనలను ప్రజలతోపాటు అధికారులు కూడా తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యాలయాల్లో ఉద్యోగులందరూ విధిగా హెల్మెట్ ధారణపై సూచించిన మేరకు రావల్సివుంటుందన్నారు. అదే విధంగా కళాశాలలకు వచ్చే విద్యార్ధులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రవాలనే నిబంధన ఆయా యాజమాన్యాలు అమలుచేయాలన్నారు. కళాశాలకు వచ్చే వాహనదారులు హెల్మెట్ ధరించి రాకపోతే నో ఎంట్రీ అని స్పష్టం చేయాలన్నారు. ఒకటికి రెండుసార్లు తొలిగా హెచ్చరించి తదుపరి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఆయా కళాశాలల్లో నోహెల్మెట్-నోఎంట్రి విధానం అమలు అవుతున్నదీ లేనిదీ సంబంధిత అధికారులు పరిశీలించాలన్నారు. ఈ విషయంపై ఆయా కళాశాలల యాజమాన్యాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆర్ టి సి బస్సులను స్పీడ్ పరిమితి దాటి వేగంగా నడిపితే సంబంధిత ఫోన్ నెంబరుకు సమాచారం అందించాలనే స్టిక్కర్లను ప్రతి బస్సుపై అతికించాలని తదుపరి రోడ్డు భధ్రత కమిటీ సమావేశానికి ఈ చర్యలు పూర్తిచెయ్యాలని ఆర్ టిసి అధికారులను ఆదేశించారు. సత్రంపాటు బ్రిడ్జివద్ద రోడ్డు వెడల్పుకు అవసరమైన మార్గాలను అన్వేషించి ప్రతిపాధనలు అందించాలని ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఆయా జాతీయ రహదారులపై పోలీసులు గుర్తించిన బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో చేపట్టవలసిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తదుపరి సమావేశాలకు మోర్త అధికారులను కూడా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుడ్ సమ్మటరిన్ పై ప్రతిఒక్కరిలో అవగాహన కలిగించాలన్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణ రక్షణకు దోహదపడిన గుడ్ సమరిటన్ ను సత్కరించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా తొలిగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒకరిని సత్కరించడం జరుగుతుందన్నారు.
జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్ మాట్లాడుతూ హెల్మెట్ తప్పనిసరి అని లేదంటే ఎంట్రీ నిషిద్ధం అనే అంశాన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, విద్యా సంస్ధల్లో ఖచ్చితంగా అమలుచేసి మిగిలిన ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. కొంతమంది డ్రైవర్ల అర్.టి సి బస్సులను అతివేగంగా నడుపుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. స్పీడ్ లిమిట్ దాటి బస్సు నడిపే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని మోటారు షోరూం లలో మోటారు బైక్ లకూ మోడిఫై చేసిన సైలెన్సర్లు, అత్యంత కాంతినిచ్చే లైట్లను అమర్చుతున్నారన్న అంశం తమ దృష్టికి వచ్చిందని ఇటువంటి వాటిని నియంత్రించేందుకు రవాణాశాఖ అధికారులు ఆయా మోటారు షోరూం లను తనిఖీ చేయాలని సూచించారు.
సమావేశంలో ఇన్ ఛార్జి ఉప రవాణా కమీషనరు కె.ఎస్.ఎం.వి. కృష్ణారావు, జంగారెడ్డిగూడెం
ఆర్టివో మహ్మద్ మదాని, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ జాన్ మోషే, జిల్లా ప్రజా రవాణాధికారి వరప్రసాద్, మున్సిపల్ కమీషనరు ఎ. భానుప్రతాప్, డిఎంహెచ్ఓ డా. మాలిని, మోటారు వెహికల్ ఇన్స్పేక్టర్లు ఎస్ బి శేఖర్, ఎండి విఠల్, ఆజ్మీరాబద్దు, జి. స్వామి, కళ్యాణి , నరేంధ్రబాబు, పలువురు ఎన్ హెచ్ అధికారులు, పోలీస్, రవాణా శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.