ఏలూరు జిల్లాలో రూ. 97.90 కోట్లతో 174 రోడ్ల అభివృద్ధి పనులు.. రోడ్ల నిర్మాణ ప్రగతి పనులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించిన రాష్ట్ర మంత్రి బి.సి. జనార్ధనరెడ్డి.
ఏలూరు,జనవరి,27:ఏలూరు జిల్లాలో రూ. 97.90 కోట్లతో 682 కి.మీ మేర రహదారులకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టగా అందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బి. సి. జనార్ధనరెడ్డి కి వివరించారు. సోమవారం స్ధానిక రెవిన్యూ గెస్ట్ హౌస్ లో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రోడ్ల నిర్మాణ ప్రగతి పనులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), చింతమనేని ప్రభాకరరావు లతో కలిసి రాష్ట్ర మంత్రి బి.సి. జనార్ధనరెడ్డి తిలకించారు. జిల్లాలో ఇప్పటి వరకు 345 కి.మీ మేర రహదారి పనులు ఆర్ అండ్ బి శాఖ అధికారులు మరమ్మతులు నిర్వహించారని కలెక్టర్ వివరించారు. గుంతలు రహిత జిల్లాగా ఉంచేందుకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్రస్ధాయిలో పరిశీలించడం అభినందనీయం అన్నారు. ఫిబ్రవరి నాటికి సంబంధిత పనులు పూర్తయ్యేలాగా ఆర్ అండ్ బి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో నగరపాలక సంస్ధ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు,డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ జి. జాన్ మోషే ,ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, తహశీల్దారు జి.వి. శేషగిరి తదితరులు ఉన్నారు.