జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి బి.సి. జనార్థన్ రెడ్డికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి.
Publish Date : 27/01/2025
ఏలూరు,జనవరి,27: ఏలూరు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బి.సి. జనార్థన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. సోమవారం స్ధానిక రెవిన్యూ అతిధి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి బి. సి. జనార్ధన్ రెడ్డిని పలువురు స్ధానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నగరపాలక సంస్ధ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పోరేటర్లు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, ఆర్ అండ్ బి. శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో రహదారుల అభివృద్ధిపై మంత్రి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రబాకర్ లతో మాట్లాడారు.