Close

ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి, 3వ తేదీన నోటిఫికేషన్ జరీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. వెట్రిసెల్వి చెప్పారు.

Publish Date : 29/01/2025

ఏలూరు, జనవరి, 29 : ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి, 3వ తేదీన నోటిఫికేషన్ జరీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఏర్పాటుచేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఫిబ్రవరి,3 వతేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, ఫిబ్రవరి, 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ల పరిశీలన 11వ తేదీన జరుగుతుందని, 13వ తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి, 27వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఓట్ల లెక్కింపు కార్యక్రమం మార్చ్, 3వ తేదీన జరుగుతుందని, ఎన్నికల ప్రక్రియ మార్చి , 8వ తేదీన ముగుస్తుందన్నారు. ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు , కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఏలూరు జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారని, నామినేషన్ల స్వీకరణ నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం వరకు ఎన్నికల ప్రక్రియ ఏలూరులో జరుగుతుందన్నారు. జనవరి, 29వ తేదీ నుండి ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 440 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయడం జరిగిందని, 3 లక్షల 15 వేల 261 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదమయ్యారని, వీరిలో లక్షా 83 వేల 734 మంది పురుషులు, లక్షా 31 వేల 507 మంది మహిళలు, 20 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారన్నారు. నామినేషన్ల తుది తేదీ వరకు ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని, www.nvsp.in వెబ్సైటు ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని, 1952 ఓటర్ హెల్ప్లైన్ సేవలు వినియోగించుకోవచ్చన్నారు. పట్టభద్రుల ఓటరు జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటె వివరాలను తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.