Close

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. వెట్రిసెల్వి.

Publish Date : 30/01/2025

ఏలూరు,జనవరి,30:ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.

గురువారం స్ధానిక కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, జిల్లాలలోని డిఆర్ఓలు, ఆర్డివోలు, తదితరులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి వెయ్యికి పైగా ఓటర్లు ఉంటే వేరే పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాధనలు ఈనెల 31వ తేదీన సమర్పించాలన్నారు. ఈ ప్రతిపాధనలు రాజకీయ పార్టీల సమావేశంలో నిర్ణయం తీసుకొని సమర్పించాల్సి వుంటుందన్నారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కు సంబంధించిన స్టేషనరి సరఫరా, పోస్టల్ బ్యాలెట్ , మోడల్ కోడ్ గురించి తహశీల్దార్లకు, నోడల్ అధికారులైన యంపిడివోలకు వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఈ దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, నేతలకు సంబంధించిన ప్లేక్సీలు, హోర్డింగ్ లు, గోడరాతలను పూర్తిస్ధాయిలో తొలగించాలన్నారు. ఎటువంటి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు జరుపకూడదని, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహణకు అలాగే లౌడ్ స్పీకర్లకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఓటర్ల క్లైయిమ్స్, అభ్యంతరాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయాలన్నారు. తహశీల్దార్లు పోలింగ్ స్టేషన్లను సందర్శించి అక్కడున్న మౌలిక సదుపాయాలను పరిశీలించాలన్నారు. ఓటరుగా ఇంకా నమోదు కానివారు నామినేషన్ల ధాఖలు ముందువరకు ధరఖాస్తులు చేసుకోవచ్చని, ఏ ఒక్క ధరఖాస్తు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఈ ఎన్నికలకు ఏలూరు జిల్లా డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సందేహాలు ఉంటే వారిని సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు.

సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.