Close

పట్టభధ్రుల నియోజకవర్గానికి సంబంధించి శని, ఆదివారం శెలవు దినాల్లో నామినేషన్లు స్వీకరించబడవు..

Publish Date : 06/02/2025

ఏలూరు, ఫిబ్రవరి, 6: తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంనకు సంబంధించి ఎన్నికల కమీషన్ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ది.03.02.2025 నుండి ది.10.02.2025 (సెలవు దినాలు మినహాయించి) నామినేషన్లు స్వీకరించబడును. నేగోషియబుల్ ఇనస్ట్రమెంట్ యాక్ట్ (negotiable Instrument Act, 1881 (by the Finance Ministry) ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం వారు ఇచ్చిన ఉత్తర్వులు నెం.4/ECI/1-ET/FUNC/JUD/SDR/VOL.1/2016, తేది.29.12.2016 అనుసరించి, ది.08.02.2025 (రెండవ శనివారం) మరియు ది.09.02.2025 (ఆదివారం) తేదిలలో తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంనకు సంబంధించి నామినేషన్లు స్వీకరించబడవని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.