Close

ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్..

Publish Date : 15/02/2025

ఏలూరు,ఫిబ్రవరి,15: ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తపాలా బ్యాలెట్ కు అవకాశం కల్పించినట్లు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబద్రుల నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం, ఎన్నికల విధులలో పాల్గొను సిబ్బంది వారి యొక్క ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించు కోవచ్చునన్నారు. ఎన్నికల విధులలో పాల్గొను సిబ్బంది వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫారం-12 ను జిల్లా రిటర్నింగ్ అధికారి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబద్రుల నియోజక వర్గం/జిల్లా కలెక్టర్, ఏలూరు వారికి ది 20-2-2025 సా. 5.00 గం లోపు సమర్పించా లన్నారు. సిబ్బంది ఫారం-12 ను eluru.ap.gov.in నుండి డౌన్లోడ్ చేసుకొన వలసింది గా కోరారు. పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేయు సిబ్బంది ఫారం-12 తో పాటు వారికి డ్యూటీ కేటాయింపు చేసిన ఉత్తర్వులు ప్రతి జతపరచ వలసిందిగా కోరారు.