Close

సచివాలయాల పరిధిలో ఉన్న వివిధ రకాల సర్వే నివేదికను గడువులోగా పూర్తిచేయాలి.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 15/02/2025

ఏలూరు/భీమడోలు,ఫిబ్రవరి,15: సచివాలయాల సిబ్బందికి కేటాయించిన విధుల టార్గెట్ ను త్వరితగతిన పూర్తిచేసి నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్వచ్ఛఆంధ్రా-స్వచ్ఛదివాస్ కార్యక్రమంలో భాగంగా గుండుగొలను గ్రామంలో పాల్గొన్న అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వి భీమడోలు తహశీల్దారు కార్యాలయంలో జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిపివో కె. అనురాధ, బి.సి సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, తహశీల్దారు రమాదేవి, యంపిడివో పద్మావతి, సచివాలయాల కార్యదర్శులు, విఆర్ఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవిన్యూ సదస్సుల అర్జీలు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, హౌసింగ్, భూసర్వే, ఆధార్ నమోదు, ఆధార్ డిట్స్, వాటర్ ట్యాంకు క్లీనింగ్, క్లోరినేషన్, ప్రభుత్వ ఆస్ధుల స్వాదీనం, తదితర అంశాలపై మండలంలోని పంచాయితీల వారిగా సమీక్ష చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోను గడువులోపు ఏరోజుకారోజు ఫొటోలతో సహా నివేదకలను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.