చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు,ఫిబ్రవరి,15: ఇంటితోపాటు సమీప పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో చెత్తనుండి సంపద సృష్టించే కేంద్రాన్ని శనివారం స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛదివాస్ కార్యక్రమం సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గ్రామంలో పారిశుధ్య కార్మికుల ద్వారా తడిచెత్త, పొడిచెత్త వేరుచేసే మూడురకాల బుట్టలను అందజేసే విధానాన్ని గ్రామంలో వున్న నివాసితులను అడిగితెలుసుకున్నారు. అదే విధంగా తడిచెత్త, పొడిచెత్త వేరుచేసే ప్రక్రియ గురించి ఇంటి యజమానులను ఆరాతీశారు. గ్రామంలో డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను ప్రతి శుక్రవారం క్లీన్ చేసే విధానాన్ని పంచాయితీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎక్కడా కూడా డ్రైవేజీలో చెత్త నిల్వ లేకుండా చూడాలని ఆదేశించించారు. పబ్లిక్ కుళాయిలు లీకేజీలు లేకుండా అరికట్టి నీటిని వృదా కాకుండా చూడాలన్నారు.
అనంతరం ఆగ్రామంలో ఉన్న చెత్తనుండి సంపదను తయారుచేసే కేంద్రాన్ని సదర్శించారు. కేంద్రంలో వున్న చెత్త నుండి తయారుచేసే సేంద్రీయ ఎరువును పరిశీలించి వీటిని రైతులకు సరఫరాచేసే విధానాన్ని, కేంద్రంలో పనిచేసే సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. పారిశుధ్యకార్మికులతో మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రతే కాకుండా కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వారికి అందజేస్తున్న చేతి గ్లౌజులు, మాస్కు, డ్రెస్ కోడ్, బూట్లు, ప్రతిరోజు ధరించి చెత్తను సేకరించాలని తెలిపారు. పారిశుద్య విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి చెత్తనుండి సంపద తయారుచేసే కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రంలో పనిచేస్తున్న వారిపై ఉందన్నారు. తడిచెత్త, పొడిచెత్త వేరుచేసే ప్రక్రియపై గ్రామ ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించడం ద్వారా ఇంటిలో వున్న వ్యర్దాలను వేరు వేరు బుట్టలద్వారా ఇవ్వడం వల్ల చెత్తనుండి సంపదను తయారుచేసే కేంద్రంలో పని సులభతరం అవుతుందని కలెక్టర్ వెల్లడించారు.
కార్యక్రమంలో జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిపివో కె. అనురాధ, యంపిడివో పద్మావతి, తహశీల్దారు రమాదేవి, ఇవోపిఆర్డి , తదితర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.