ఓటు హక్కు వినియోగానికి ప్రత్యేక క్యాజువల్ లీవ్..
Publish Date : 18/02/2025
ఏలూరు,ఫిబ్రవరి,18: తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజున తూర్పు పశ్చిమగోదావరి జిల్లా పట్టబద్ర నియోజకవర్గ పరి
ధిలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈమేరకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు సంస్థలు, యాజమాన్యాలు వారి వద్ద పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సర్దుబాట్లు చేసుకోవాలని సూచించారు.