Close

గ్రూప్-2 ప్రశ్నపత్రాలు, ఓ ఎం ఆర్ షీట్లకు స్ట్రాంగ్ రూంలో పటిష్ట భద్రత కల్పించాలి: జేసీ పి . ధాత్రిరెడ్డి

Publish Date : 20/02/2025

ఏలూరు, ఫిబ్రవరి, 20 : ఈనెల 23వ తేదీన జిల్లాలో జరగనున్న గ్రూప్-2 పరీక్షల ప్రశ్నపత్రాలు, ఓ ఎం ఆర్ షీట్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం సాయంత్రం గ్రూప్-2 పరీక్షల ఓ ఎం ఆర్ షీట్ల భద్రతను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్ -2 పరీక్షలకు సంబందించిన ఓ ఎం ఆర్ షీట్లు జిల్లాకు చేరుకున్నాయని, వాటికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పరీక్షరోజున ప్రశ్నపత్రాలతో పాటు ఓ ఎం ఆర్. షీట్లు కూడా పరీక్షా కేంద్రాలకు పూర్తిస్థాయి భద్రతతో తీసుకువెళ్లాల్సి ఉంటుందని, అందుకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు.
జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విజయకుమార్, ప్రభృతులు పాల్గొన్నారు.