Close

ఓట్ల లెక్కింపు శిక్షణా కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు సిహెచ్. శ్రీధర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. వెట్రిసెల్వి..

Publish Date : 24/02/2025

ఏలూరు, ఫిబ్రవరి,24: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
పారదర్శకంగా జరిగేలా సంబంధిత అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఎన్నికల పరిశీలకులు సిహెచ్. శ్రీధర్ అన్నారు. స్థానిక సర్. సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీఎన్నికల ఓట్లలెక్కింపు ప్రక్రియకు సంబంధించిన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు సిహెచ్. శ్రీధర్ ఓట్లలెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా, ప్రశాంతవాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు దృష్టిలో పెట్టుకొని ఓట్లలెక్కింపు ప్రక్రియ అంతా పారదర్శకంగా, సజావుగా జరిగేందుకు కౌంటింగ్ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, ప్రాధమికదశ ఓట్ల లెక్కింపు డిటైల్డ్ కౌంటింగ్, రిజెక్టెడ్, డౌట్ పుల్ ఓట్లు, కౌంటింగ్ ఏజెట్లు, తదితర అంశాలపై కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్చి 3వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెట్లు, ఉదయం 6 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో 35 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారన్నారు. మొత్తం 3,14,984 మంది ఓటర్ల తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుమారు మూడు రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా షిప్టులవారీ ఓట్ల లెక్కింపు సిబ్బందిని నియమించామన్నారు. దానికి అనుగుణంగా సిబ్బంది హాజరు కావాలన్నారు. ఓట్లలెక్కింపుకు 28 టేబుల్స్, 17 రౌండ్లు నిర్వహించేందుకు ప్రతిపాధనలు పంపడం జరిగిందన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, కౌంటింగ్ ఏజెంట్ల విధులు, ప్రాధమిక దశ ఓట్ల లెక్కింపు డిటైల్డ్ కౌంటింగ్, రిజెక్టెడ్, డౌట్ పుల్ ఓట్లు, కౌంటింగ్ ఏజెట్లు విధులు, బ్యాలెట్ బాక్సులు తెరవడం, బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టడం, తదితర అంశాలపై కౌంటింగ్ అబ్జర్వర్లు, సూపర్ వైజర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బందికి డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, మాస్టర్ ట్రైనిస్ శ్రీనివాస్, ఫణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ప్రాక్టికల్ గా కూడా ఓట్లలెక్కింపు ప్రక్రియపై శిక్షణ ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్ఢి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, మైక్రోఅబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.