కోకో రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ..
ఏలూరు,మార్చి 6:జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి కి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు, కోకో రైతులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతులు వద్ద ఉన్న కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కిలోకు రూ. 900 ధర ఇచ్చి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవల ఎరువులు ధరలు, కూలీ ఖర్చులు పెరిగాయన్నారు. కోకో గింజలు కొనుగోలు సమస్యపై ప్రభుత్వం, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కోకో రైతులకు న్యాయం చేయకపోతే కంపెనీల మోసాలకు గురై పెద్ద ఎత్తున నష్టపోయి అప్పుల పాలై ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
కోకో రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ రైతులతో కొద్దిసేపు చర్చలు జరిపి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యాన శాఖ కమిషనర్, ప్రభుత్వం దృష్టికి కోకో రైతుల సమస్యలు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కోకో గింజలు కొనుగోలు కంపెనీలతో వెంటనే సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కోకో గింజలు కొనుగోలు సమస్య పరిష్కారానికి తగు చర్యలు చేపడతామని చెప్పారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ కె.వె ట్రిసెల్వి కు కోకో రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కె. శ్రీనివాస్,
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం, కొబ్బరి రైతుల సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, ఎస్ గోపాలకృష్ణ, జే కాశిబాబు, ఎల్ గోపాలరావు, పి అచ్యుతరామయ్య, కట్ట భాస్కరరావు, ఎం సుబ్బారెడ్డి,గుది బండి రమేష్ రెడ్డి, కోనేరు సతీష్, నరసింహారావు, లోకేష్, బి. సుబ్బారావు, బొబ్బా రమేష్, వి.రాంబాబు, జి శ్రీనివాస్, ఎం.నరేంద్ర, పి. కృష్ణ, ఎస్ రాంబాబు, వి.నాగరాజు, ఎం.శాంతరాజు, ఎం.సత్యనారాయణ,ఎన్. లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి,ఎన్టీఆర్,కృష్ణా తదితర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కోకో రైతులు తరలివచ్చారు.