35వ జాతీయ సౌత్ జోన్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం పొందిన బలగ స్వామినాయుడు.. బలగ స్వామినాయుడును అభినందించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
ఏలూరు, మార్చి, 10 : 35వ జాతీయ సౌత్ జోన్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఏలూరులోని ప్రభుత్వ క్రీడా ప్రాధికార సంస్ధ విశ్వనాధ్ భర్తియా స్విమ్మింగ్ పూల్ కి చెందిన బలగ స్వామినాయుడు 50 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో మూడవ స్థానం లో నిలిచి కాంస్య పతకం ను కైవసం చేసుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న బలగ స్వామినాయుడును కలెక్టర్ అభినందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. స్విమ్మింగ్ కాంపిటేషన్ కు అవసరం అయిన స్విమ్మింగ్ రేసింగ్ సూట్ ను, రేసింగ్ గాగుల్స్ ను, రేసింగ్ కాప్ ను స్వామినాయుడుకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అందజేసి అభినందించారు. స్వామినాయుడుకు స్విమ్మింగ్ లో శిక్షణ అందిస్తున్న శిక్షకుడు గణేష్ ను కూడా కలెక్టర్ ఈ సందర్బంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.